Entertainment

భారీ రెస్పాన్స్ తో దూసుకెళ్తున్న “వారియర్” యాక్షన్ టీజర్.! |


ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటించిన లేటెస్ట్ సాలిడ్ యాక్షన్ డ్రామా “ది వారియర్”. తమిళ నాట మాస్ సినిమాల స్పెషలిస్ట్ దర్శకుడు ఎన్ లింగుసామి తెరకెక్కించిన ఈ చిత్రం భారీ అంచనాలు సెట్ చేసుకొని సిద్ధంగా ఉంది. అయితే తెలుగు మరియు తమిళ్ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించగా నిన్ననే మేకర్స్ ఈ సినిమా టీజర్ ని తెలుగు సహా తమిళ్ భాషల్లో రిలీజ్ చేశారు.

అయితే ఈ టీజర్ లు ఇప్పుడు సాలిడ్ రెస్పాన్స్ ని అందుకుంటూ దూసుకెళ్తున్నాయి. మరి తెలుగులో అయితే ఈ టీజర్ భారీ స్థాయిలో 9 మిలియన్ వ్యూస్ కి దగ్గరలో వ్యూస్ రాగ తమిళ్ లో 2 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి. దీనితో ఇంకా 24 గంటలు పూర్తి కాక ముందే ఆల్రెడీ 10 మిలియన్ మార్క్ వ్యూస్ ని ఈ టీజర్ క్రాస్ చేసేసింది. ఇక ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. అలాగే శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ వారు నిర్మాణం వహించారు.



Source link

Leave a Reply

Your email address will not be published.