Entertainment

అక్కడ కేజీఎఫ్ ను బీట్ చేసిన పుష్ప..! |



ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం పుష్ప ది రైజ్. ఈ చిత్రం డిసెంబర్ 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ల లో విడుదల అయ్యి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం పాన్ ఇండియా మూవీ గా విడుదల కావడం తో అన్ని చోట్ల కలెక్షన్ల విషయం లో దూసుకు పోతుంది.

ఈ చిత్రం హిందీ లో కూడా విడుదల అయిన సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా ఈ చిత్రం మరొక రికార్డు క్రికెట్ చేయడం జరిగింది. హిందీ లో కేజీఎఫ్ చిత్రం లైఫ్ టైం లో సాధించిన వసూళ్ళను పుష్ప 13 రోజుల్లో అధిగమించడం విశేషం. ఈ చిత్రం 13 రోజుల్లో 45.5 కోట్ల రూపాయల తో బాలీవుడ్ లో దూసుకు పోతుంది. ఈ చిత్రం లో రష్మీక మందన్న హీరోయిన్ గా నటించగా, సమంత స్పెషల్ సాంగ్ లో నటించడం జరిగింది. ఈ చిత్రం లో సునీల్, అనసూయ భరద్వాజ్, ఫాహద్ ఫజిల్, ధనంజయ లు కీలక పాత్రల్లో నటించారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం ను మైత్రి మూవీ మేకర్స్ మరియు ముత్తంశెట్టి మీడియా సంయుక్తం గా నిర్మించడం జరిగింది. పుష్ప రెండవ పార్ట్ పుష్ప ది రూల్ వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లనుంది.



Source link

Leave a Reply

Your email address will not be published.